వామ్మో: అల్లు అర్జున్ హీరోయిన్ ఇలా అయ్యిందేంటి..?

Divya
సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం ఇందులో చాలామంది నటీనటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. మరి కొంతమంది కొన్ని చిత్రాలలో నటించిన రాని గుర్తింపు  కేవలం ఒక్కసీనిమా తో వస్తువుంటుంది. అలా మొదట చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన సెలబ్రిటీలు ఆ తర్వాత స్టార్ డం అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఒకటి రెండు సినిమాలలో నటించి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ల హీరోయిన్ దీక్షా సేత్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ రెబల్ వేదం తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటి సంపాదించుకుంది.

ముఖ్యంగా ఈమె అందానికి సైతం కుర్రకారులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. వేదం సినిమా తర్వాత తెలుగులో దీక్షకు బాగానే ఆఫర్లు వచ్చాయి.. అలా గోపీచంద్ నటించిన వాంటెడ్ రవితేజ నటించిన నిప్పు, మిరపకాయ, రెబల్ తదితర సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఇందులో ఏ సినిమా కూడా ఈమెకు పెద్దగా ఇమేజ్ ని తెచ్చి పెట్టలేదు. చివరిగా 2012లో ఊ కొడతారా ఉలిక్కిపడతారా అనే సినిమాలో కూడా నటించింది.ఆ తర్వాత మరే తెలుగు సినిమాలో కూడా నటించలేదు ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ పలు సినిమాలలో నటించింది.

అక్కడ కూడా దీక్షా సేత్ కి అదృష్టం కలిసే రాలేదు.దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. ప్రస్తుతం అయితే కన్నడ హీరో దర్శన్ తో కూడా ఒక సినిమాలో నటించినట్లు సమాచారం. అవకాశాలు రాలేకపోవడంతో ఈమె లండన్ లో సెటిల్ అయినట్లుగా సమాచారం దీక్ష ప్రస్తుతం అక్కడే ఐటి జాబ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు సైలెంట్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. బీచ్ లో బికినీ ఫోటోలతో ఈ ముద్దుగుమ్మ అలాగే తన స్నేహితులతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: