గేమ్ ఛేంజర్ కు. శంకర్ తో గండమేనా..?

Divya
భారీ చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ శంకర్.. ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలతో హీరోలను చూపిస్తూ ఉంటారు శంకర్.. శంకర్, కమలహాసన్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు-2 సినిమా ఈ రోజున విడుదల అయింది. 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు-2 చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా పైన భారీగా అంచనాలతో విడుదలైనప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేదని తెలియజేస్తున్నారు. శంకర్ టేకింగ్ విషయంలో మాత్రం ఎలాంటి సందేహాలు లేవు కానీ కమలహాసన్ కూడా కదకు తగ్గట్టుగానే నటించారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కానీ కథ విషయంలో శంకర్ ఎంచుకున్న కథ ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాలేదని తెలియజేస్తున్నారు. భారతీయుడు-2 సినిమా పరిస్థితి ఇలా ఉంటే ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలంగా శంకర్ కథలో ఎంపిక విషయంలో కాస్త తలబడుతున్నారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.. గతంలో ఐ, 2.0 చిత్రాల విషయంలో కూడా ఇలాగే జరిగింది ఇప్పుడు ఇండియన్-2 సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ కావడంతో పాత శంకర్ కనిపించడం లేదు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

వీరికి తోడు గేమ్ చేంజర్ చిత్రాన్ని శంకర్ ఎలా డీల్ చేస్తారో అని అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా గేమ్ చేంజర్  సినిమా చరణ్ ఫ్యాన్స్ కి ఒక గండంలా మారింది. ఈ గండం గడిస్తే చాలని అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ కూడా నటించింది. హీరోయిన్ అంజలి సునీల్ తదితర సెలబ్రిటీలు కూడా ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం. ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలలో కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: