వెబ్ సిరీస్ పై చార్టెడ్ ఎకౌంటెంట్ల తిరుగుబాటు !

Seetha Sailaja
భారీ సినిమాల బడ్జెట్ తో సమానంగా ప్రస్తుతం వెబ్ సిరీస్ లు నిర్మాణం జరుగుతున్నాయి. ఈవిషయంలో నెట్ ఫ్లిక్స్ వ్యూహాలు చాల విభిన్నంగా ఉంటున్నాయి. తాము నిర్మాణం చేసే వెబ్ సిరీస్ లలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా పెట్టి ఏదో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసి తమ వెబ్ సిరీస్ కు విపరీతమైన రేటింగ్ తెచ్చుకునే విషయంలో నెట్ ఫ్లిక్స్ చాల విభిన్నమైన వ్యూహాలు అనుసరిస్తోంది.

ఆమధ్య అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ‘డెబ్యూ’ మూవీ ‘మహారాజ్’ విడుదలకు ముందు ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. ఈ వివాదాలు తారా స్థాయికి చేరుకోవడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కోర్ట్ చుట్టూ తిరగవలసిన పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా మరో వెబ్ సిరీస్ విషయంలో నెట్ ఫ్లిక్స్ నిర్వాహకులు సమస్యలు ఎదుర్కుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్ వెబ్ సిరీస్ చుట్టూ కొన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. అందుతున్న సమాచారం మేరకు ఈ వెబ్ సిరీస్ కథలో కూడ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. సిఏ లో టాప్ ర్యాంకర్ గా నిలిచిన హీరో ఒంటరి మహిళలకు లైంగిక సేవలు అందిస్తుంటాడు.

అంటే కాల్ బాయ్ పాత్ర ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన కథ ఇన్స్ టిట్యూట్ అఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ దృష్టి వరకు వెళ్లడంతో ఎంతో ఉన్నతమైన తమ వృత్తిని కించపరుస్తూ ఇలాంటి వెబ్  సిరీస్ ను ఎందుకు స్ట్రీమ్ చేయబోతున్నారు అంటూ వారు కోర్టుకు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే  ఎన్నో సినిమాలలో డాక్టర్లను లాయర్లను రాజకీయ నాయకులను విలన్స్ గా చూపెడుతూ కథలు వస్తున్న నేపధ్యంలో ఒక చార్టెడ్ ఎకౌంటెంట్ ను కాల్ బాయ్ గా చూపెడుతూ తీసిన వెబ్ సిరీస్ కు న్యాయస్థానాల నుండి ఆటంకాలు ఉండకపోవచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: