స్టార్ కావాలనుకుంటే అటువంటివి ఒప్పుకోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేసిన సింగర్ భార్య..!

lakhmi saranya
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. కొంతమంది తాము అలాంటి ఎక్స్పీరియన్స్ ఏది ఎదుర్కోలేదు అని చెప్పగా మరి కొంతమంది మాత్రం దీని గురించి ఓపెన్ గా చెబుతూ వస్తున్నారు. ఇక దీని గురించి అలా కామెంట్స్ చేసిన వారిలో సింగర్ నోయెల్ భార్య ఎస్తర్ కూడా ఒకరు. ఇప్పటికే తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురైనట్లు ఈమె ఓపెన్ గా తెలియజేసింది. ఎస్తరు మాట్లాడుతూ.." సమాజంలో ఇండస్ట్రీ కూడా ఒక భాగమే .


బయట సమాజంలో కూడా వేధింపులు అనేవి ఉన్నాయి . ప్రతి రంగంలో మహిళపై జరిగే అన్యాయాలు జరుగుతూనే ఉంటున్నాయి . కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి . ఎందుకంటే ఇండస్ట్రీలో ఇటువంటివి చేయడానికి అవకాశాలు ఎక్కువ . దీన్ని మనం దూరం చేయలేం ‌. అమ్మాయిలు అందంగా, ఎన్నో ఆశలతో, ఇండస్ట్రీలో ఏదో సాధించాలని వస్తే కచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకునే మగవాళ్లు ఉన్నారు . ఎవ్వరు దాని గురించి బలవంత పెట్టరు . కానీ ఆ ఛాయిస్ అయితే ఉంది .


అవకాశాల కోసం నువ్వు ఏం చేయగలుగుతావు అనే చూస్తారు " అంటూ ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది ఈ బ్యూటీ . ఇక మీకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు అని యాంకర్ ప్రశ్నించగా.." నేను అలా చేయను ‌. నా దారిలో నేను వెళ్తాను . అంతే ఎవరు బలవంత పెట్టరు . అలా కాకుండా నాకు తొందరగా పెద్ద స్టార్ కావాలని ఉంది ఏం చెప్పినా చేస్తాను అనుకునే వాళ్ళకి అదే షార్ట్ కట్  " అంటూ తెలిపింది. ఇక తన సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవాలని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: