భారతీయుడు 2 ను వెంటాడుతున్న సమస్యలు !

Seetha Sailaja
‘కల్కి 2898’ విడుదలై రెండు వారాలు గడిచిపోవడంతో ఆసినిమా మ్యానియా చాలావరకు తగ్గిపోయింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి సంబంధించిన కలక్షన్స్ కూడ బాగా తగ్గాయి అన్న వార్తలు వస్తున్న పరిస్థితులలో ‘కల్కి’ టార్గెట్ గా పెట్టుకున్న 1000 కోట్ల కలక్షన్స్ మార్క్ అందుకోవడం కష్టం అన్న సంకేతాలు వస్తున్నాయి.

ఈ పరిస్థితుల మధ్య ఈరోజు విడుదల కాబోతున్న ‘భారతీయుడు 2’ కలక్షన్స్ పై ట్రేడ్ వర్గాలకు కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఈసినిమాకు కూడ ప్రభుత్వాల నుండి టిక్కెట్ రేట్ పెంపుదలకు సంబంధించి అనుమతులు తెచ్చుకోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఈసినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు బాగానే వెళుతున్నాయి అన్న సంకేతాలు వస్తున్నాయి.

అయితే ఈసినిమాకు వచ్చే పాజిటివ్ టాక్ ను బట్టి ఈసినిమా ఘనవిజయం ఆధారపడి ఉంటుంది. ఈసినిమాలో నటించిన కమలహాసన్ సిద్దార్ధ్ లు ఈసినిమాను ప్రమోట్ చేస్తూ దేశంలోని అన్ని ప్రధాన నగరాలను కవర్ చేశారు. ఈమూవీలో కీలక పాత్రలలో నటించిన కమలహాసన్ సిద్దార్థ్ రకుల రకుల్ ప్రీత్ లకు ఈమూవీ విజయం తమ కెరియర్ కు సంబంధించి కీలకంగా మారింది. విక్రమ్ మూవీతో కమలహాసన్ తిరిగి ట్రాక్ లోకి వచ్చినప్పటికీ ఈమూవీ సక్సస్ పై కమల్ కు కొన్ని సందేహాలు ఉన్నాయి అన్న  వార్తలు  వస్తున్నాయి  

వాస్తవానికి ఈమూవీలో కమలహాసన్ పాత్రకంటే హీరో సిద్దార్థ్ పాత్ర ఎక్కువగా ఉంటుంది అన్న ప్రచారం బాగా జరుగుతోంది ఈ గాసిప్ లపై కమలహాసన్ కానీ సిద్దార్థ్ కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేకుండా వారిద్దరు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ‘భారతీయుడు 3’ గురించి మాట్లాడుతున్న పరిస్థితుల్లో వారద్దరికీ ‘భారతీయుడు 2 పై నమ్మకం లేదా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. దీనికితోడు సీక్వెల్ కు సంబంధించి ఇప్పటి వరకు విడుదలఅయిన పాటల ట్యూన్స్ చాల మందికి నచ్చక పోవడంతో ‘భారతీయుడు 2’  సూపర్  హిట్  అవడం  అంత సులువు  కాదు అన్న కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: