రివ్యూ: భారతీయుడు-2 రివ్యూ.. కమల్ హాసన్ విశ్వరూపమే.. కానీ..?

Divya
హీరో కమలహాసన్ 1996లో వచ్చిన భారతీయుడు సినిమా ఒక అద్భుతమని చెప్పవచ్చు.. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో కమలహాసన్ డ్యూయల్ రోల్లో కనిపించారు. భారతీయుడు సినిమా అన్ని భాషలలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్నది. ముఖ్యంగా యుద్ధ విద్యలు మర్మ కళలు తెలిసిన వృద్ధుడి పాత్రలో సైతం కమలహాసన్ అద్భుతంగా నటించారు. అలాగే సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో పాటు పాటలు కూడా హైలెట్ గా నిలిచాయి. ఎన్నో ఏళ్ల తర్వాత సిపిఎం ప్రకటించి ఈ రోజున తాజాగా భారతీయుడు-2 సినిమా ను ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం జరిగింది డైరెక్టర్ శంకర్.. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

2019 జనవరిలో షూటింగ్ మొదలైన భారతీయుడు-2 సినిమా ఈ 2024 జులై 12న అంటే ఈ రోజున విడుదల చేస్తున్నారు.. ఇక ట్విట్టర్ టాక్ ప్రకారం భారతీయుడు-2 సినిమా ఫస్ట్ ఆఫ్ జస్ట్ యావరేజ్ అని సినిమాలో హీరో సిద్ధార్థ మీద ఓపెన్ అవుతుందని నెటీ జెన్స్ సైతం తెలుపుతున్నారు.. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్నటువంటి అవినీతి మీద సిద్ధార్థ్ తన టీం తో కలిసి చేస్తున్నటువంటి కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉంటారట.. కథలో మెయిన్ పాయింట్ ని టచ్ చేశారు..

ఇక సేనాపతి (భారతీయుడు) అవినీతి పాల్పడిన కొడుకును చంపి విదేశాలకు వెళ్లిపోవడం మొదటి భాగం ముగుస్తుంది.. భారతీయుడు-2 విషయానికి వస్తే విదేశాల నుంచి కమలహాసన్ ఇండియాకి తిరిగి వస్తాడు అలా తన పోరాటం మరొకసారి మొదలు పెట్టడం వంటివి ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తున్నాయట. కానీ కమలహాసన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే సినిమా డల్ అయింది అనే విధంగా నేటిజన్స్ తెలుపుతున్నారు..

వృద్ధుడి పాత్రలో కమలహాసన్ గెటప్స్ ఫస్టాఫ్ లో పెద్దగా ఆకట్టుకోలేదని టాక్ కూడా వినిపిస్తోంది. స్క్రీన్ ప్లే శంకర్ మార్క్ బాగానే ఉన్న ఎందుకో అంతగా ఆకట్టుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. పాటలు కూడా చాలామందినీ నిరాశపరిచాయని తెలుపుతున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అందరినీ ఆకట్టుకుందనీ.. ఫస్ట్ ఆఫ్ లో ఒకటి రెండు సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయని  ఎక్కువగా సాగదీసిన డైలాగులు సన్నివేశాలు నిరాశపరిచాయని తెలుపుతున్నారు. సెకండాఫ్ పర్వాలేదని క్లైమాక్స్లో ట్విస్ట్ ఈ సినిమాకి హైలైట్ గా ఉందని తెలిపారు.

ఇందులో నటించిన సిద్ధార్థ్, రకుల్, ఎస్కే సూర్య, బాబి సింహ తమ పాత్రలకు సైతం న్యాయం చేశారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇండియన్-2 చిత్రం పర్వాలేదు అనిపిస్తుంది.. మరి పూర్తి రివ్యూ రావాలంటే మరొకది గంటలు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: