హిట్ కోసం పరితపిస్తున్న వెంకటేష్.. ఈ సరైన లక్ కలిసొచ్చేనా..?

murali krishna
టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ క్రేజీ కాంబోల్లో ఒకటి వెంక‌టేశ్, అనిల్ రావిపూడి. ఎఫ్‌2, ఎఫ్ 3 సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంపౌండ్ నుంచి మరో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కాగా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చింది.ఇక ముచ్చటగా మూడోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయాడానికి సిద్ధమైయ్యారు వీరిద్దరు.శ్రీవెంకటేశ్వర బ్యానర్ లో దిల్ రాజు-శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ తాజాగా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన అప్డేట్ ను దిల్ రాజు పంచుకున్నారు.స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేశ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో అందరూ ఎఫ్4గా భావించారు. కానీ ఇది కామెడీ సినిమా కాదని, పూర్తి యాక్షన్ మూవీ అని స్పష్టం చేశాడు డైరెక్టర్ అనిల్. ఇక ఈ మూవీలో వెంకటేశ్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు నటిస్తున్నారు. భార్య ఐశ్వర్య, మాజీ లవర్ గా మీనాక్షి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తాజాగా షూటింగ్ ను స్టార్ట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రొడ్యూసర్ దిల్ రాజు పంచుకున్నారు. మీనాక్షి చౌదరిపై కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
కాగా.. శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో వస్తున్న 58వ చిత్రాంగా తెరకెక్కుతున్న ఈ మూవీని సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో సంక్రాంతి రేసు రసవత్తరంగా మారింది. ఇందులో వెంకీ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. వెంకీ-అనిల్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి.. 2025 సంక్రాంతి బరిలో నిలవాలని మేకర్స్ భావిస్తున్నారు. వెంకీతో ఈసారి అనిల్ రావిపూడి గట్టిగానే ప్లాన్ చేశాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమా కోసం వైజాగ్ వచ్చినట్లు తెలుస్తుంది.వైజాగ్ లో డైలాగ్స్ రాసె పనిలో వున్నాడని ఫిలిం వర్గాల సమాచారం.ఈ సినిమాను కూడా అనిల్ తన మార్క్ కామెడీతో అదిరిపోయే యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: