టాలీవుడ్ మీసం మేలేసే రికార్డ్ కొట్టిన కల్కి?

Purushottham Vinay

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము దులిపేస్తుందనే చెప్పాలి.ఓ రేంజ్ లో ఈ సినిమా అదరగొడుతోంది. ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తూ సినీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని కట్టిపడేశాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. ఇందులో ప్రభాస్ కటౌట్‌కి తగ్గ పాత్ర ఇంకా ఆ పాత్రకు తగ్గ యాక్షన్ సీన్లు ఓ రేంజ్‌లో అదిరిపోయాయి. ఫుల్ సూట్ ధరించిన ప్రభాస్, అమితాబ్ చేసే యాక్షన్ స్టంట్లు థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించాయి.ఇలాంటి పాత్రలో కానీ, ఇలాంటి యాక్షన్ సన్నివేశాల్లో కానీ ప్రభాస్‌ను, అమితాబ్ ను ఇంత వరకు ఏ సినిమాలోనూ చూడలేదని సినీ అభిమానులు మురిసిపోతున్నారు. ఇంకా అంతేకాకుండా ఇతర నటులకు కూడా వారి రేంజ్‌కు తగ్గ పాత్రలు కేటాయించి చూపించిన తీరు అందరినీ బాగా ఆకట్టుకుంది. తీసింది మూడు సినిమాలే అయినా వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు నాగ్ అశ్విన్.

ఎన్నో సినిమాలు చేస్తే కానీ అందని గుర్తింపు కేవలం కల్కి సినిమాతో దర్శకుడు నాగ్ అశ్విన్ అందుకోవడం జరిగింది. నిజంగా అతడి క్రియేటివిటీ, విజువల్ ఎఫెక్ట్స్‌కి యావత్ సినీ ప్రపంచం అంతా కూడా సలాం కొట్టింది. ఒక టాలీవుడ్ డైరెక్టర్ ఇంతటి డేరింగ్ చేసి సినిమా తీశాడంటే ఎవరూ కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో తెలుగు సినీ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాడు సీనియర్ దర్శకుడు రాజమౌళి. అయితే ఇప్పుడు ఆ కీర్తిని 'కల్కి' సినిమాతో దర్శకుడు నాగ్ అశ్విన్ మరింత పెంచడం జరిగింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉందనే చెప్పాలి.తాజాగా ఈ కల్కి మూవీ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, జవాన్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ మూవీల రికార్డులను కూడా ఈజీగా బ్రేక్ చేసింది. కేవలం 14 రోజుల్లో రూ.1002కోట్లు కలెక్ట్ చేసిన ఫాస్టెస్ట్ సెకండ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. మొదటి స్థానంలో 'బాహుబలి 2' సినిమా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: