మహేష్ కోసం బిగ్ రిస్క్ తీసుకుంటున్న జక్కన్న?

Purushottham Vinay

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత చేయబోతున్న సినిమా పై దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ సినీ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.ఇప్పటికే మహేష్‌ బాబుతో సినిమాకు రాజమౌళి తన వర్క్‌ మొదలు పెట్టారు. ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా గురించి రోజుకు ఒక వార్త సోషల్‌ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల తమిళ స్టార్ హీరో విక్రమ్‌ ఈ మూవీలో నటించబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు మహేష్ బాబును డబుల్‌ రోల్‌ లో రాజమౌళి చూపించేందుకు కథ ను రెడీ చేశాడు అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం విక్రమార్కుడు సినిమాలో మాస్ రాజా రవితేజ ను డబుల్‌ రోల్‌ లో రాజమౌళి చూపించాడు. ఆ తర్వాత బాహుబలి మూవీలో ప్రభాస్ ను రెండు పాత్రల్లో చూపించాడు. 


మళ్లీ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో ఆ రిస్క్ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే డబుల్‌ రోల్‌ అంటే కచ్చితంగా రిస్క్‌ ఉంటుంది. హీరో పోషించే రెండు పాత్రలకు సాధ్యం అయినంత ఎక్కువ ప్రాముఖ్యతని ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇతర నటీనటుల విషయంలో కూడా ఏమాత్రం తక్కువ చూపించకూడదు. అందుకే డబుల్‌ రోల్‌ సినిమాలు దర్శకులకు చాలా రిస్క్ అనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.ఫారిన్ మేకోవర్‌ ఆర్టిస్టులను రప్పించిన రాజమౌళి ఇప్పటికే చాలా గెటప్స్ ను రెడీ చేయించారు. మహేష్ బాబు పై లుక్స్ టెస్ట్‌ కి రాజమౌళి రెడీ అవుతున్నాడు అనే సమాచారం తెలుస్తుంది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు గడ్డం పెంచుకుని కనిపించాడు. గతంలో లాగా కాకుండా కచ్చితంగా విభిన్న లుక్‌ లో కనిపించబోతున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో సినిమా గురించి మీడియాలో జరుగుతున్న పలు ప్రచారాలు ఇంకా షికార్లు చేస్తున్న పుకార్ల గురించి కూడా క్లారిటీ ఇచ్చే విధంగా ఏమైనా ప్లాన్ చేయండి అంటూ ఫ్యాన్స్ రాజమౌళిని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: