'టిల్లు క్యూబ్ 'లో ఆ హాట్ హీరోయిన్..?

murali krishna
ప్రియాంక జవాల్కర్ ప్రముఖ నటి. ప్రియాంక జవాల్కర్ నటించిన తాజా చిత్రాలు SR కళ్యాణ మండపం, టాక్సీవాలా మరియు కాల వరం ఆయే.టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు సక్సెస్‌ సాధించడం చాలా అరుదు. కానీ ప్రియాంక జవాల్కర్‌ తొలి సినిమా ‘టాక్సీవాలా’తోనే హిట్‌ కొట్టేసి, లక్కీ హీరోయిన్‌ అనిపించుకుంది. చూడ్డానికి నార్త్‌ అమ్మాయిలా ఉండటం కూడా ప్రియాంకకు కలిసొచ్చిందని చెప్పాలి. రెండో సినిమా ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’తో ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేసింది. హిట్టయిన రెండూ చిన్న సినిమాలే కావడంతో ప్రియాంకకు అవకాశాలు పెద్దగా రాలేదు. అయితే.. స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన‌ ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ ను అందుకున్నాయో మనం చూశాం. త‌న‌దైన యాక్టింగ్ తో సిద్ధు ఈ సినిమాల‌ను ఆడియెన్స్ కు క‌నెక్ట్ అయ్యేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు ”టిల్లు క్యూబ్” అంటూ ఈ సినిమాల‌కు కొన‌సాగింపును చేస్తున్నాడు.అయితే, డీజే టిల్లులో నేహా శెట్టి హీరోయిన్ గా త‌న‌దైన అందాల‌తో కుర్ర‌కారును ఆక‌ట్టుకుంది. ఇక టిల్లు స్క్వేర్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా త‌న అందంతో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. అయితే, టిల్లు క్యూబ్ లో ఓ తెలుగు బ్యూటీని హీరోయిన్ గా తీసుకునేందుకు సిద్ధు ప్లాన్ చేస్తున్నాడట‌.”ట్యాక్సీవాలా” ఫేం ప్రియాంక జావల్క‌ర్ ఇటీవ‌ల స‌రైన హిట్ లేక స‌త‌మ‌తువుతోంది. అయితే, ఈ బ్యూటీని ‘టిల్లు క్యూబ్’ లో లీడ్ హీరోయిన్ గా తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే, అమ్మ‌డికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఈ సినిమాతో తిరిగి త‌న కెరీర్ ను ట్రాక్ ఎక్కించే అవ‌కాశం దొరుకుతుంది. ఇక ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడ్యూస్ చేయ‌నుంది. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ త్వ‌రలో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: