ఆ పోటీలో ఈసారైనా వెంకీ గెలిచినా.. బరిలో ఏకంగా అంతమంది..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్ ఇప్పటికి అనేక విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వెంకటేష్ దగ్గర నుండి సరైన విజయం రాలేదు. మధ్యలో ఈయన నటించిన నారప్ప , దృశ్యం 2 మూవీ లకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కినప్పటికీ ఈ సినిమాలు థియేటర్ లలో కాకుండా నేరుగా ఓ టి టి లో విడుదల అయ్యాయి.

ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేష్ "సైంధవ్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో శ్రద్ధ శ్రీ నాథ్ హీరోయిన్ గా నటించగా ... శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కానీ విడుదల అయిన తర్వాత మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో వెంకీ కి ఈ సంవత్సరం సంక్రాంతి కి నిరాశనే మిగిలింది. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేకపోయినా వెంకటేష్ వచ్చే సంవత్సరం సంక్రాంతి కోసం ఇప్పటి నుండే కసరత్తు మొదలు పెట్టాడు.

ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతికి చాలా మంది సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ ఒకటి. అలాగే మరికొన్ని సినిమాలు కూడా అప్పటికి సంక్రాంతి రేసులోకి వస్తాయి. మరి వాటిని తట్టుకొని ఈ సారి వెంకీ ముందు వరసలో నిలబడతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: