భారతీయుడు ప్రమోషన్స్ : రకుల్ ఓకే.. కాజల్ నాట్ ఓకే.. అదే రిజన్..?

Pulgam Srinivas
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం భారతీయుడు అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా విడుదల అయిన చాలా సంవత్సరాలకి కమల్ హాసన్ హీరో గా శంకర్ భారతీయుడు 2 మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ పాటు రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్రలలో నటించగా ... బ్రహ్మానందం  ఎస్ జె సూర్య , బాబి సింహ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం అద్భుతమైన రీతిలో ప్రమోషన్లను చేస్తూ వస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో ఎక్కువ శాతం కమల్ హాసన్ , శంకర్ , సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తున్నారు. కానీ ఎక్కువ శాతం కాజల్ అగర్వాల్ మాత్రం ఏ ఈవెంట్ లలో కూడా కనిపించడం లేదు. దీనితో ఎందుకు ఈ ముద్దుగుమ్మ భారతీయుడు 2 ప్రమోషన్లలో కనబడడం లేదు అనే అనుమానాలు చాలా మంది లో రేకత్తుతున్నాయి. కాకపోతే ఇందులో పెద్ద సందేహ పడాల్సిన విషయం ఏమీ లేదు. భారతీయుడు 2 తో పాటు భారతీయుడు 3 కి సంబంధించిన చాలా భాగం సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయ్యింది.

ఇది ఇలా ఉంటే భారతీయుడు 2 సినిమా విడుదల అయిన కొంత కాలానికే 3 నీ కూడా విడుదల చేయాలి అని ఆలోచనలో మూవీ బృందం వారు ఉన్నారు. ఇక భారతీయుడు 2 లో కాజల్ అగర్వాల్ కు సంబంధించిన సన్నివేశాలు ఏమీ లేవు అని కాజల్ సన్నివేశాలు అన్ని మూడవ భాగం లోనే ఉంటాయి అని శంకర్ గారు గతంలోనే చెప్పుకొచ్చారు. దానితోనే ఈమె రెండవ భాగం ప్రమోషన్లకు హాజరు కావట్లేదు అని తెలుస్తుంది. ఈమె మూడవ భాగం ప్రమోషన్లలో హాజరు అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: