ప్రభాస్ ఆఖరి 6 మూవీలకు హిందీలో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
ప్రభాస్ ఆఖరుగా నటించిన ఆరు మూవీ లకు హిందీ వెర్షన్ లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమాకి హిందీ వర్షన్ లో 511 కోట్ల నెట్ కలెక్షన్ లు వచ్చాయి.
తాజాగా ప్రభాస్ కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. దిశా పటాని ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలలో నటించగా ... ఈ మూవీ లో కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించాడు. జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు సంబంధించిన 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఇకపోతే ఈ మూవీ హిందీ వర్షన్ కు కేవలం 8 రోజుల్లోనే 163.25 కోట్ల నెట్ కలెక్షన్ లు వచ్చాయి.
ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ హిందీ వర్షన్ కి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ క్లోజ్ అయ్యే సరికి 153.85 కోట్ల నెట్ కలెక్షన్ లు వచ్చాయి.
ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురష్ అనే సినిమా తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ హిందీ వర్షన్ కు బాక్స్ ఆఫీస్ రన్ అయ్యే సరికి 148 కోట్ల నెట్ కలెక్షన్ లు వచ్చాయి.
ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎం ఎం కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన బాహుబలి మొదటి భాగం హిందీ వర్షన్ కు 118.7 కోట్ల నెట్ కలెక్షన్ లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: