ప్రభాస్ హీరోగా
నాగ్ అశ్విన్ తెరకెక్కించిన
కల్కి 2898 ఏడి
మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్
బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని
బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 371 కోట్ల షేర్, 742 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 16 కోట్లు వరకూ రాబట్టింది. తద్వారా
ప్రభాస్ సినిమా టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్‌గా స్టేటస్‌ను అందుకుంది.ఈ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ అయ్యి ఈ
సినిమా క్లీన్ హిట్ అయ్యి లాభాల్లోకి వచ్చేసింది.600 కోట్ల భారీ బడ్జెట్ తో
కల్కి 2898 ఏడి సినిమాని
వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్
నిర్మాత అశ్విని దత్ నిర్మించాడు.కల్కి 2898 ఏడి చిత్రంలో
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు. దిశా పఠాని గ్లామర్ రోల్ లో బాగా మెప్పించింది.
కల్కి సినిమాలో టాప్ డైరెక్టర్స్ రాజమౌళి,
ఆర్జీవీ ఇద్దర్ని ఒప్పించి గెస్ట్ రోల్స్ చేయించాడు నాగ్ అశ్విన్.
ఆర్జీవీ తెరపై కనపడినప్పుడు థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి.
ఆర్జీవీ ఫ్యాన్స్ కూడా ఈ గెస్ట్ పాత్రపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్జీవీని
నాగ్ అశ్విన్ ఎలా ఒప్పించాడు అని అంతా అనుకున్నారు.నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించగా ఓ
మీడియా ప్రతినిధి
ఆర్జీవీ గారిని గెస్ట్ అప్పీరెన్స్ కి ఎలా ఒప్పించారు అని అడిగారు. దీనికి
నాగ్ అశ్విన్ సమాధానమిస్తూ.. మన తెలుగు
సినిమా స్థాయిని మార్చింది
ఆర్జీవీ, రాజమౌళి. వారిద్దరూ నాకు ఇష్టం. వారిద్దరికీ ఒక ట్రిబ్యూట్ లాగా ఇవ్వాలని అనిపించి వాళ్ళని గెస్ట్ అప్పీరెన్స్ ని అడిగాను.
ఆర్జీవీ గారిని అడిగితే నేనెప్పుడూ నటించలేదు, నేను ఎందుకు అన్నారు. కలియుగం చివర్లో మీ లాంటి మనుషులే ఉంటారు అందుకే మీరు చిన్న రోల్ చేస్తే బాగుంటుంది అని అడిగాను. దీంతో వెంటనే ఆయన ఒప్పుకొని షూటింగ్ ఎప్పుడో చెప్పు వచ్చేస్తాను అన్నారని తెలిపారు.దీంతో
నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
నాగ్ అశ్విన్ కలియుగం చివరలో మీ లాంటి మనుషులే ఉంటారు అని ఆర్జీవికి చెప్పడం,
ఆర్జీవీ ఆ మాటకి ఓకే చెప్పడంతో అందరూ కరెక్ట్ గానే చెప్పారు అని అనుకుంటున్నారు. కొంతమంది ఆర్జీవీని కలితో పోలుస్తూ పబ్లిక్ లో అవమానిస్తావా అని కామెంట్స్ చేస్తున్నారు.