అజిత్ : "గుడ్ బ్యాడ్ అగ్లీ" ఆ మూవీకి రీమేక్..?

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ ఆఖరుగా తునీవు అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి విశాల్ హీరోగా రూపొందిన మార్క్ అంటోనీ సినిమాకు దర్శకత్వం వహించి సూపర్ సక్సెస్ ను అందుకొని దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ మూవీ హాలీవుడ్ మూవీ అయినటువంటి "ది గ్యాంగ్ స్టర్ ది కాప్ ది డెవిల్" అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని ఓ టాక్ కోలీవుడ్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. మరి ఈ టైటిల్ కి తగ్గట్టుగానే అజిత్ పై కూడా మూడు షేడ్స్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు. మరి సినిమా హాలీవుడ్ మూవీ అయినటువంటి "ది గ్యాంగ్ స్టర్ ది కాప్ ది డెవిల్" కి రీమేక్ గా చేస్తున్నారా లేదా అనేది మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ మూవీ ని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ నిర్మిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అజిత్ హీరోగా నటిస్తూ ఉండడం , ఇక ఈ సినిమాను తెలుగు క్రేజీ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి మూవీ సంస్థ నిర్మించడం, ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తమిళ్ , తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: