మృణాల్ తీసుకున్న ఈ ఫోటో ప్రత్యేకత అదే!

Suma Kallamadi
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకే ఒక్క మూవీ సీతారామం సినిమాతో ఈ అమ్మడు ఇక్కడ పాగా వేసింది. ఈ క్రమంలో అటు నార్త్ లో.. ఇటు సౌత్ లో సినిమాలు చేస్తూ ముందుకు పోతోంది. కాగా ఈ అమ్మడు రీసెంట్ గా కల్కి 2898 ఏడీలోకూడా ఓ కేమియో రోల్ లో నటించి మెప్పించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో దివ్య రోల్ లో మూవీ ఆరంభంలోనే మృణాల్ క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇస్తుంది. కాగా ఈ గెస్ట్ రోల్ కోసం మృణాల్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. వైజ‌యంతీ మూవీస్ బ్యానర్ పై ఉన్న అభిమానంతోనే ఆమె కల్కి సినిమాను డబ్బులు తీసుకోకుండా నటించినట్లు స‌మాచారం.
కాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో కూడా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారని టాక్. ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ ముద్దుగుమ్మ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే అల్ట్రా గ్లామరస్ ఫోటోస్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక తెలుగు సినిమాల్లో సంప్రదాయంగా కనిపించిన ఈ అమ్మడు నెట్టింట మాత్రం అందాలు ఆరబోస్తూ సందడి చేస్తుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాషన్ స్టైలిష్ట్ నమిత అలెగ్జాండర్.. మృణాల్ క్రేజీ పిక్స్ ను షేర్ చేసింది. మ్యాగ్ జైన్ కోసం దిగిన ఫోటోలను పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే అందులో ఒక్కో ఫోటో వేరే లెవెల్ ఉందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అవును, నిజమే.. బ్లాక్ కలర్ జంప్ సూట్ లో మృణాల్ కుర్రకారుని కిర్రెక్కించేలా రెచ్చగొడుతోంది. ఎద అందాలు కనిపించే కనిపించకుండా ఊరిస్తోంది. లాంగ్ ఫ్రాక్ డ్రెస్ లో ఓపెన్ బ్యాక్ తో ఫిదా చేస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ట్రెడిషనల్ స్లీవ్ లెస్ డ్రెస్ మైండ్ బ్లాక్ అంటూ మృణాల్ అభిమానులు ఫోటోని షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మృణాల్ ఠాకూర్ పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మృణాల్ అంటే అందం.. అందం అంటే మృణాల్ అంటూ నెటిజన్లు ఆమెను ఆకాశానికెత్తేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: