భారతీయుడు 2 ట్రైలర్ రివ్యూ: ఇది కదరా శంకర్ బొమ్మంటే! విశ్వనటుడికి తిరుగులేదు!

Purushottham Vinay
ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ 'భారతీయుడు' మూవీకి సీక్వెల్గా వస్తున్న 'భారతీయుడు 2' మూవీ విడుదలకు రెడీ అయింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత సీనియర్ నటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఎన్నో భారీ అంచనాలే ఉన్నాయి.ఇందులో సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ వంటి యంగ్ యాక్టర్స్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్నో ఆటంకాల మధ్య ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధం కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాజాగా విడుదలైన ‘భారతీయుడు 2’ ట్రైలర్ అయితే అంచనాలను మరింత పెంచేసింది. ట్రైలర్ కట్ మాములుగా లేదు. శంకర్ ఈజ్ బ్యాక్.. ఇది కదరా శంకర్ బొమ్మ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ ట్రైలర్ లో కమల్ హాసన్ యాక్షన్ అదిరిపోయిందనే చెప్పాలి. ట్రైలర్ లోనే ఇంత యాక్షన్ చూపించాడంటే ఇక సినిమాలో విశ్వ రూపం చూపించడం పక్కా అంటున్నారు నెటిజన్స్. విశ్వనటుడు కమల్ హాసన్ కి తిరుగు లేదు అంటున్నారు.


 ట్రైలర్ లో సిద్ధార్థ్ పాత్ర కూడా హైలైట్ అయ్యింది. అతని పాత్ర, డైలాగ్స్ ప్రేక్షకులకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేట్టు ఉన్నాయి. ఇక అనిరుద్ BGM అయితే సూపర్ గా ఉంది. ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేట్టు ఉంది. ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య మెయిన్ విలన్ గా నటిస్తుండగా బాబీ సింహ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు అర్ధమవుతుంది. అలాగే లేట్ యాక్టర్ వివేక్ గారిని కూడా మనం చూడవచ్చు.ఇలా ఎంతో మంది టాలెంటెడ్ స్టార్స్ నటిస్తున్నారు.స్వాతంత్ర్య సమరయోధుడు వీరశేఖరన్ సేనాపతి పాత్రలో కమల్ హాసన్ కనిపించాడు. మొదటి భాగం చివరల్లో కమల్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. దేశంలో అవినీతిని నియంత్రించడంలో తన సాయం అవసరం అయినప్పుడు తిరిగి వస్తానని ప్రమాణం చేయగా దాన్ని నిలబెట్టుకునేందుకు మళ్లీ వచ్చాడు. ట్రైలర్‌లో కమల్‌హాసన్ నటన, యాక్షన్ మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంది. మొత్తానికి డైరెక్టర్ శంకర్ తన మార్క్ ఏంటో మళ్ళీ చూపించేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: