ట్రైలర్: అదరగొట్టేస్తున్న ఇండియన్-2 ట్రైలర్.. తిరిగోచ్చిన సేనాపతి..!

Divya
లోకనాయకుడిగా పేరుపొందిన హీరో కమలహాసన్ తన కెరియర్లో ఏన్నో విభిన్నమైన చిత్రాలలో నటించారు. ముఖ్యంగా భారతీయుడు సినిమా కమల్ హాసన్ కు మంచి పేరు తీసుకువచ్చింది. 1996లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇప్పుడు సీక్వెల్ ని రిలీజ్ చేయబోతున్నారు. గత కొన్నేళ్లుగా ఇండియన్-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్, టీజర్ వంటివి విడుదల చేశారు చిత్రబృందం.అలాగే నటీనటుల పోస్టర్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది.

తాజాగా ఇండియన్-2 చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని ఈ రోజున కొన్ని నిమిషాల క్రితం విడుదల చేశారు. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో సిద్ధార్థ, రకుల్ ప్రీతిసింగ్ ,ప్రియా భవాని శంకర్ నటిస్తూ ఉన్నారు. అలాగే ఎస్ జె సూర్య, బాబి సింహ వంటి నటీనటులు కూడా ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నది.

ప్రపంచవ్యాప్తంగా ఇండియన్-2 చిత్రం జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేస్తోంది. ట్రైలర్ విషయానికి వస్తే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వీర శేఖరన్ సేనాపతి పాత్రలో కమలహాసన్ అద్భుతంగా నటించినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా అవినీతిని నియంత్రించడంలో తన సాయం అవసరమైనప్పుడు దిగి వస్తానని కూడా మాట ఇవ్వడంతో ఆ మాటను నిలబెట్టుకునేందుకు మళ్లీ వచ్చానంటూ ట్రైలర్లో కమలహాసన్ చెప్పడం జరుగుతోంది. కమలహాసన్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉన్నది ఆయన చెప్పిన డైలాగులు కూడా అందరిని ఆకట్టుకునే విధంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రైలర్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: