బిగ్ బాస్ సీజన్ 8 :ఈ సారి కథ 'వేరేలెవెల్'..!

murali krishna
బిగ్ బాస్ హౌస్‌లో 20 మంది కంటెస్టెంట్స్ అంటే.. వామ్మో ఎవర్రా వీళ్లంతా అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు సీజన్ 8లో అంతకు మించిన విచిత్రాలు చాలానే ఉండబోతున్నాయి.బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అయ్యింది. విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ని.. రన్నర్‌గా అమర్‌ దీప్‌ని ప్రకటించడం వివాదం కాగా.. సీజన్ 7 అయితే సూపర్ సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ 6 వరస్ట్ సీజన్‌గా నిలవడంతో.. ఆ తప్పు మళ్లీ జరగకుండా సీజన్ 7 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక.. టాస్క్‌లు.. ఎలిమినేషన్స్.. నామినేషన్స్.. విజేత ఎంపిక ఇవన్నీ చాలా ట్విస్ట్‌లతో సాగింది.బిగ్‌బాస్ ఫైన‌ల్ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేకెత్తించాయి. బిగ్ బాస్ సీజ‌న్ 7 గ్రాండ్ స‌క్సెస్ కావడంతో బిగ్‌బాస్ సీజన్ 8ను త్వరలోనే స్టార్‌మా స‌న్నాహాలు చేస్తోంది. ఈ సారి కొత్త రూల్స్‌, గేమ్స్‌తో బిగ్‌బాస్ 8 ప్రారంభం కాబోతుందని చెబుతున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్ట్ కు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి బడా బడా స్టార్స్ ని కూడా రంగంలోకి దించబోతుంది బిగ్ బాస్ టీం అంటూ ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇద్దరు టాప్ సింగర్స్ తో పాటు ఒక విడాకులు తీసుకున్న జంటను సైతం హౌస్ లోకి పంపబోతున్నారట. అంతేకాదు పలువురు యూట్యూబర్లను కూడా ఈ సారి కంటెస్టెంట్లుగా సెలక్ట్ చేశారట.ఈ సారి బిగ్ బాస్ కొత్త రూల్స్ కూడా పెట్టబోతుందట. మరీ ముఖ్యంగా గతంలో బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు బయటకు రాబోతున్నారు అనే విషయాలు ఇట్టే మీడియాకు లీకయ్యేవి.. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ఏ కాంటెస్టెంట్ అయినా సరే ఎలిమినేట్ అయిన రెండు వారాలు అలాగే సీక్రెట్ రూంలో ఉండాల్సిందేనట. ఆ తర్వాత మళ్లీ టాప్ త్రీ కంటెస్టెంట్లను సెలక్ట్ చేసి ఎవరు హౌస్ లోకి రావాలి అనుకుంటున్నారో వాళ్లకు ఓట్లు వేయిస్తారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరైతే వరస్ట్ పర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లను బయటకు పంపించేలా కొత్త టాస్క్ పెట్టబోతున్నారట. దీంతో ఈ సీజన్ మరింత కాంట్రవర్షియల్ గా మారబోతుంది అంటున్నారు. అసలకే అవసరం ఉన్నా లేకపోయినా ఒకరిమీద ఒకరు అరుచుకుంటారు.. ఇలాంటి కన్నింగ్ థీమ్ తీసుకొస్తే ఈ సారి ఏకంగా కొట్టుకొని చస్తారని నెటిజన్స్ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: