ఇక శర్వా సెట్ అయినట్టే.. ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హోల్డ్ చూపిస్తున్న మనమే..!

Pulgam Srinivas
శర్వానంద్ కొన్ని సంవత్సరాల పాటు వరుసగా అపజయాలను ఎదుర్కొంటూ వచ్చాడు. దానితో శర్వానంద్ కెరియర్ ఇక కష్టమే అని చాలా మంది అనుకున్నారు. అలాంటి సమయంలోనే ఈయన ఒకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. దానితో ఈయన కాస్త ఫామ్ లోకి వచ్చాడు. తాజాగా శర్వానంద్ "మనమే" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమాతో కనుక శర్వా మరొక విజయం అందుకున్నట్లు అయితే ఈయన మళ్లీ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చినట్లే అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. ఇకపోతే ఇప్పటికే శర్వా "మనమే" సినిమాతో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 17 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
17 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.80 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 94 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 4.03 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 17 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.77 కోట్ల షేర్ ... 16.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 17 రోజుల్లో 60 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 17 రోజుల్లో 10.52 కోట్ల షేర్ ... 20.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా 17 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని 52 లక్షల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: