రికార్డ్ సృష్టించిన కల్కి సెకండ్ ట్రైలర్... విజువల్ వండర్ కి దగ్గర రెస్పాన్స్ ఇదే..?

MADDIBOINA AJAY KUMAR
రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో సలార్ మొదటి భాగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. సలార్ మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏ డి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అమితా బచ్చన్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. అలాగే దీపికా పదుకొనే , దిశ పాటని కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ లో కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించాడు. ఈ మూవీ జూన్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్లను విడుదల చేసింది. ఈ రెండు ట్రైలర్లకి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన రెండవ ట్రైలర్ కు 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ మూవీ సెకండ్ ట్రైలర్ తెలుగు వర్షన్ కి 24 గంటలు ముగిసే సరికి 12.03 మిలియన్ వ్యూస్ ... 485.7 కే లైక్స్ లభించాయి.

ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా రెండవ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కాకపోతే ఈ సినిమా నుండి విడుదల చేసిన మొదటి ట్రైలర్ కు ఇంతకంటే ఎక్కువ రెస్పాన్స్ 24 గంటల సమయంలో ప్రేక్షకుల నుండి లభించింది. ప్రస్తుతానికి ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ స్థాయి విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: