కమల్ కమాల్! డార్లింగునే డామినేట్ చేసేశాడే?

Purushottham Vinay
రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ విడుదలకు సర్వం సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్  పెంచేస్తున్నారు.ఆడియన్స్ ఫోకస్ మొత్తాన్ని సినిమా వైపు తిప్పుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన కల్కి మేకర్స్.. సెకండ్ ట్రైలర్ తో కూడా ఆ అంచనాలని ఆకాశాన్ని తాకేలా చేశారు.ఇక సెకండ్ ట్రైలర్ అయితే విజువల్ ఫీస్ట్ గా అదిరిపోయింది. ఈ ట్రైలర్ ను మేకర్స్ చాలా అద్భుతంగా కట్ చేశారు. ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, శోభనను బాగా చూపించారు. అలాగే యంగ్ హీరోయిన్ మాళవిక నాయర్ ను సర్ప్రైజింగ్ గా రివీల్ చేశారు. ప్రస్తుతం సెకండ్ ట్రైలర్.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే అందరి దృష్టి ఎక్కువగా విలక్షణ నటుడు కమల్ హాసన్ పైనే నెలకొంది.కల్కిలో కమల్ లుక్ చూస్తే ఎవరూ కూడా ఆయన గుర్తుపట్టలేరు. అంతలా తన పాత్ర కోసం మేకోవర్ చేసుకున్నారు. దీంతో కమల్ డెడికేషన్ పట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. 


కనిపించింది తక్కువ సేపే అయిన మెయిన్ హీరో ప్రభాస్ నే డామినేట్ చేసేలా ఉన్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. మంచి అవుట్ పుట్ కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా కమల్ హాసన్ చాలా ఈజీగా చేస్తారని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. లేటు వయసులో కూడా ఆయన అంకిత భావం వేరే లెవల్ లో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో కమల్ పైనే చర్చ నడుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ భైరవగా నటిస్తున్నప్పటికీ.. కల్కిగా మారుతాడని తెలుస్తుంది.ఇక కల్కికి విరోధి అయిన కలి రోల్ లో ఎవరు నటించారనే డిస్కషన్ ఇప్పుడు జరుగుతోంది. ఆ పాత్ర కూడా కమల్ హాసన్ చేస్తున్నారని తెలుస్తుంది.రీసెంట్ గా ముంబైలో జరిగిన ఈవెంట్ లో తాను సినిమాలో బ్యాడ్ మ్యాన్ గా కనిపిస్తానని తెలిపారు కమల్.ఈ సినిమాలో తన లుక్ విభిన్నంగా ఉండాలని ముందే డిసైడ్ అయినట్లు ఆయన చెప్పారు. ఈ మూవీకి సంబంధించిన ఏ విజువల్స్ కూడా తాను చూడలేదని అన్నారు. మరి మూవీ రిలీజ్ అయ్యాక.. కమల్ ఎలా మెప్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: