ఒక హిట్ ప్రొడ్యూసర్ తో చేతులు కలపనున్న మెగా హీరో..?

murali krishna
మెగా ఫ్యామిలీలో యంగ్‌ హీరోలకు కాలం కలిసి రావడం లేదు. మెగా ఫ్యామిలీలో హీరోలంతా ఎప్పటికప్పుడు సినిమాలతో బిజీగా ఉంటారు. కానీ ప్రస్తుతం ఈ ఫ్యామిలీలోని సీనియర్ హీరోలు బిజీ అవ్వగా.. యంగ్ హీరోలు మాత్రం స్లో అయ్యారు.వారి సినిమాలు ఆగిపోవడం, లేదంటే ఫెయిల్ అవ్వడమే జరుగుతున్నాయి. వరుణ్‌ తేజ్‌ని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. వైష్ణవ్‌ తేజ్‌కి మొదటి సినిమా తప్ప మిగిలిన అన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. అల్లు శిరీష్‌కి సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇక సాయిధరమ్‌ తేజ్‌ గతేడాది ఏడాదిపాటు బ్రేక్‌ తీసుకున్నట్టు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్ గతేడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చి హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ అప్కమింగ్ మూవీపై ఇంకా క్లారిటీ లేదు. తాజాగా తన తరువాతి చిత్రం గురించి సోషల్ మీడియాలో షేర్ చేసి అధికారికంగా ప్రకటించాడు ఈ మెగా హీరో. తన అప్కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఒక హిట్ నిర్మాతతో చేతులు కలపనున్నాడు సాయి ధరమ్ తేజ్.తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ‘హనుమాన్’ను నిర్మించి దేశవ్యాప్తంగా విపరీతమైన లాభాలు సంపాదించుకున్న నిర్మాతలు కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్లో 18వ చిత్రాన్ని కూడా ఈ నిర్మాతలే నిర్మించడానికి ముందుకొచ్చారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఎస్డీటీ 18 తెరకెక్కనుంది. తాజాగా ఈ మూవీ అనౌన్స్మెంట్తో పాటు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్.‘నా నెక్స్ట్ ఎస్డీటీ 18. ఇది మరింత స్పెషల్గా ఉండబోతుంది. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి’ అంటూ ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ఇక ఈ పోస్టర్పై ‘ఈ నేల తన రాక కోసం ఎదురుచూస్తోంది. తను భూమి లోతుల్లో నుండి పుట్టుకొస్తాడు’ అని ఉంది. దీంతో ఇదేదో డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న చిత్రమని ఫ్యాన్స్ అంతా సాయి ధరమ్ తేజ్కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ముందుగా సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి చాలాకాలంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ అప్పుడే మరో మూవీని ప్రారంభించాడు ఈ హీరో. ఎస్డీటీ 18తో రోహిత్ అనే దర్శకుడు టాలీవుడ్కు పరిచయమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: