కల్కి విషయంలో ప్రశాంత్ నీల్ ని ఫాలో అయిన నాగ్ అశ్విన్... మరోసారి సేమ్ మిస్టేక్ రిపీట్..!

lakhmi saranya
పాన్ ఇండియా వైడ్ గా రాబోతున్న చిత్రం కల్కి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా దీపిక పదుకొనే అండ్ దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీపై రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి రెండవ ట్రైలర్ ని విడుదల చేశారు మూవీ యూనిట్. ఈ ట్రైలర్ ప్రెజెంట్ సోషల్ మీడియాని షేక్‌ చేస్తుంది. ఇక ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ అంతగా వర్కౌట్ అవ్వకపోవడంతో పలువురు నిరాశకు గురయ్యారు.
ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియా డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ చాలా సంవత్సరాల అనంతరం రూపొందిస్తున్న సినిమా ఇది. తాజాగా నాగ్ అశ్విన్.. ప్రశాంత్ నిల్ ని ఫాలో అవుతున్నాడు అంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా? సాధారణంగా ప్రశాంత్ నీల్‌ డైరెక్ట్ చేసే సినిమాలు అన్నీ కూడా గజిబిజిగా ఉంటాయి. జక్కన్న లాగా డైరెక్ట్ పాయింట్ పై వెళ్లడు ప్రశాంత్ నీల్. అందరూ సినిమాని మొదటి నుంచి ఎండింగ్ కి తీసుకువెళ్తారు. కానీ నీల్ మామ మాత్రం ఎండింగ్ నుంచి స్టార్టింగ్ కి తీసుకొస్తాడు. ఈ కాన్సెప్ట్ కొన్ని కొన్ని సార్లు వర్కౌట్ అయినప్పటికీ మరికొన్నిసార్లు మాత్రం బోల్తా కొట్టింది. కే జి ఎఫ్ వంటి చిత్రాలకి ఈ కాన్సెప్ట్ బాగానే వర్కౌట్ అయింది. కానీ తాజాగా వచ్చిన సలార్ కి మాత్రం ఇది అస్సలు వర్క్ అవుట్ అవ్వలేదు.
సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ దానిని చెప్పే విధానంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఆ కాన్సెప్ట్ ప్రేక్షకులకి అర్థం కాక సినిమా ఎందుకు చూసాం అని అనుకున్నారు కూడా. అలా నీల్ మామ రూపొందించే సినిమాలను అర్థం చేసుకోవాలంటే మాస్టర్ బ్రెయిన్ ఉండాలి. ఇక తాజాగా నాగశ్విన్ రూపొందిస్తున్న కల్కి మూవీ కూడా ఈ విధంగానే ఉంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎటునుంచి ఎటు వెళ్తుందో కూడా పెద్దగా అర్థం కావడం లేదు. ఈ విషయంలో నాగ్ అశ్విన్ ప్రశాంత్ నీల్ ని గుడ్డిగా ఫాలో అవుతున్నాడని చెప్పుకోవచ్చు. సినిమా కాన్సెప్ట్ బాగుంది.. బట్ మూవీ ని ప్రేక్షకుల ముందు చూపించడంలో విఫలమవుతున్నాడు. అటువంటి ప్రశాంత్ నిల్ ని రోల్డ్ మోడల్ గా తీసుకుని నాగ్ అశ్విన్ కూడా కొత్త ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: