నెక్స్ట్ మూవీతో అలాంటి ప్రయోగం చేయనున్న అఖిల్.. ఈసారైనా గట్టెక్కేనా..?

Pulgam Srinivas
అక్కినేని కుటుంబ మూడో తరం వారసులలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చిన్నతనంలో సిసింద్రీ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించిన మనం సినిమాలో చిన్న గెస్ట్ పాత్రలో నటించాడు. ఇక ఈయన ఫుల్ లెన్త్ హీరో పాత్రలో అఖిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ కు నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఆ తర్వాత ఈయన వరుసగా సినిమాలు నటిస్తున్న అవి పెద్దగా సక్సెస్ కావడం లేదు.

మధ్యలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కాస్త పర్వాలేదు అనే స్థాయి విజయం అందుకుంది. ఈ నటుడు ఆఖరుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా అఖిల్ కు నిరాశనే మిగిల్చింది. ఇకపోతే అఖిల్ ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ యువ నటుడు తన తదుపరి మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ బ్యానర్ వారు ఇప్పటికే అందుకు సంబంధించిన ఒక కథను కూడా రెడీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ కథ గ్రామీణ నేపథ్యంలో సాగనున్నట్లు అందులో భాగంగా అఖిల్ ఒక పల్లెటూరి యువకుడి పాత్రలో మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పాత్ర కోసం అఖిల్ అదిరిపోయే స్థాయిలో కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను సాధించడంతో అఖిల్ తన తదుపరి మూవీ తో సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకోవాలి అనే కసితో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: