నందమూరి నట సింహం
బాలకృష్ణ మరికొన్ని రోజుల్లో
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే వెలువడింది. ఇప్పటికే
బాలయ్య ,బోయపాటి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. అందులో మొదటిగా
సింహ అనే
మూవీ రాగా , ఇది అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ
మూవీ కంటే ముందు
బాలయ్య వరస అపజయాలలో ఉన్నాడు. ఈ
మూవీ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వీరి కాంబోలో
లెజెండ్ , అఖండ మూవీలు రూపొందాయి.
ఈ సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఇలా ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో రూపొందిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడంతో వీరి కాంబోలో తెరకెక్కబోయే నాలుగవ మూవీపై భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. ప్రస్తుతం
బోయపాటి ,
బాలయ్య సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను
బాలకృష్ణ మరో రెండు , మూడు నెలల్లో కంప్లీట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఆ
సినిమా కంప్లీట్ కాగానే
బాలయ్య ,
బోయపాటి కాంబో
మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో
టాలీవుడ్ యువ నటుడు
కిరణ్ అబ్బవరం ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తపై తాజాగా
కిరణ్ అబ్బావరం స్పందిస్తూ నన్ను ఇప్పటివరకు
బాలయ్య ,
బోయపాటి కాంబో
మూవీ కోసం ఎవరు సంప్రదించలేదు. కానీ ఆ
మూవీ యూనిట్ నన్ను ఆ సినిమాలో నటించమని అడిగితే కచ్చితంగా నేను ఆ
సినిమా చేస్తాను అని ఈ
యువ నటుడు చెప్పుకొచ్చాడు.