సూపర్ స్టార్ బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలిస్తే నిజంగా షాక్అవ్వాల్సిందే..?

murali krishna
టాలీవుడ్ లో మహేష్ బాబు సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నారు. ఆయన ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటిస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. దీని కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను దాదాపు కంప్లీట్ చేశాడు జక్కన్న.ఇక మహేష్ బాబుకు ఏమాత్రం గ్యాప్ దొరికినా.. తన ఫ్యామిలీని వెంటేసుకుని వెంటనే ఫారెన్ ప్లైట్ఎక్కేస్తుంటాడు. ఈ నేపధ్యంలో మహేష్ బాబు కుటుంబ సమేతంగా తాజాగా ఫారెన్ ట్రిప్ కు వెళ్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో వీరు సందడి చేశారు. ఫోటోలో, మహేష్ బాబు, అతని భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార మరియు కుమారుడు గౌతమ్ హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోవడం చూడవచ్చు.అయితే సినిమాలు, షూటింగ్ లు.. లేకుండా ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్పులు.. ఇవే మహేష్ బాబు ప్రపంచం. ఇక మహేష్‌బాబు పొడవాటి జుట్టు మరియు గడ్డంతో, నలుపు రంగు ట్రాక్ ప్యాంట్‌తో బ్రౌన్ కోటు మరియు డార్క్ కలర్ కాంబినేషన్ టోపీతో కనిపించారు. అయితే ఇక్కడ మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేటంటే.. ఓ అదే ఆయనవాడే బ్యాగ్.. మహేష్ వాడే బ్యాగ్ ను గమించారా..?ప్రతీ సారి మహేష్ బాబు ట్రిప్పుకు వెళ్ళినప్పుడల్లా తన వెంట తీసుకెళ్లిన విలాసవంతమైన లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎంఎం బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ దీని కాస్ట్ ఎంతో తెలుసా.. అక్షరాలా 3.92 లక్షలు. అంటే దాదాపు 4 లక్షల రూపాయల బ్యాగ్ అన్నమాట.అయితే ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే. ఈసారి ట్రిప్పు వెనకాల కారణం వేరే ఉన్నట్టు తెలుస్తోంది. గౌతమ్ తన ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ యూనివర్సిటీలో చేరాడు. అందుకే మహేష్ బాబు మరియు అతని కుటుంబం గౌతమ్ ను అక్కడ వదిలేసి రావడానికి న్యూయార్క్ వెళ్లినట్లు సమాచారం.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే... రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ మూవీ.. ఆఫ్రికాలోని అడవుల నేపథ్యంలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. భారీ అడ్వెంచర్ మూవీగా ఇది తెరకెక్కబోతుందట. హనుమంతుని ఆధారంగా మహేష్ బాబు పాత్రను రూపొందించబోతున్నారని వినికిడి. ఇక ఈసినిమా షూటింగ్ కు సబంధించి అధికారికంగా సందడి స్టార్ట్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: