
గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అయితే వీరిద్దరి జోడి రెండోసారి సినిమాలో రిపీట్ అవుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయంపై అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్స్ సృష్టించాయి. అయితే ఇక ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి.. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ ఒక న్యూస్ తెగ వైరల్ గా మారిపోయింది.
ఈ సినిమాను అక్టోబర్ 31న లేదంటే డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే వీటిలో ఏదో ఒక రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తారని ఇక అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పటికే గేమ్ చేజర్ మూవీ నుంచి విడుదలైన కొన్ని సాంగ్స్ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. కాగా శ్రీ వేంకటేశ్వర బ్యానర్ పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకోగలుగుతుందో చూడాలి.