ఓటీటీ లో దుమ్ము లేపుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా , అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో సాయి కుమార్ , గోపరాజు రమణ , అయేషా ఖాన్ , హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో నటించగా , యువన్ శంకర్ రాజా. ఈ మూవీ కి సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
 

ఈ మూవీ మే 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న సమయం లోనే ఈ మూవీ ని ఓ టి టి ప్లాట్ ఫామ్ లో జూన్ 14 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ప్రకటించారు. దీనితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న కలెక్షన్లు కూడా ఈ న్యూస్ తో దెబ్బకు పడిపోయాయి.

ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ప్రస్తుతం ఈ సినిమా ట్రెండింగ్ 2 లో కొనసాగుతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ గా మారింది. ఇప్పటికీ ఎవరైనా ఈ సినిమాను చూడని వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: