సినిమా ప్రమోషన్ కి దూరంగా కృతి.. కారణం అదే..?

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి "ఉప్పెన" అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో మెగా కుటుంబానికి సంబంధించిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన బుచ్చిబాబు సన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కృతి శెట్టి కి మాత్రమే కాకుండా హీరోగా వైష్ణవ్ కి దర్శకుడిగా బుచ్చిబాబు కు కూడా మొదటి సినిమా కావడం విశేషం. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో కృతి తన సాలిడ్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు రావడం మొదలు అయింది.

అందులో భాగంగా ఈమె ఉప్పెన సినిమా తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీలు కూడా విజయాలను అందుకున్నాయి. దీనితో ఈమె అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత నుండే ఈమె లక్ రివర్స్ అయ్యింది. ఆ తర్వాత నుండి ఈమె నటించిన మాచర్ల నియోజకవర్గం , ది వారియర్ , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి , కస్టడీ ఇలా నటించిన అన్ని సినిమాలు బోల్తాకొడుతూ రావడంతో ఈ బ్యూటీ క్రేజ్ చాలా వరకు తగ్గింది.

తాజాగా ఈ నటి మనమే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. శర్మానంద్ హీరోగా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. మొదట ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయిలోనే ఈ మూవీ కలెక్షన్లను రాబడుతుంది. ఇకపోతే ఈ మూవీ ప్రమోషన్లలో కృతి ఎక్కువగా కనబడడం లేదు. అందుకు ప్రధాన కారణం కృతి ముందుగానే ఈ మూవీ నిర్మాతలకు ప్రమోషన్లలో ఎక్కువ పాటిస్పేట్ చేయను అని చెప్పిందట. అలాగే సినిమాకి మిక్స్ డ్ టాక్ రావడంతో ప్రమోషన్లు చేసిన పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు అనే ఉద్దేశంతో కూడా ఈ సినిమా  ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks

సంబంధిత వార్తలు: