ఆ హీరో నటిస్తే రొమాన్స్... నిర్మిస్తే వైలెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే... విశ్వక్ సేన్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఇప్పటికే ఈ సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి రెండింటితో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. ఈ సంవత్సరం మొదట విశ్వక్ "గామి" అనే ఒక వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ మూవీ పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు కాస్త నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఈ మూవీ పుంజుకొని పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ తాజాగా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నవదీప్ తాజాగా యేవమ్ అనే సినిమాను నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించింది.

ఈ మూవీ జూన్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల సందర్భంగా విశ్వక్ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. విశ్వక్ ఈ ఈవెంట్ లో నవదీప్ గురించి మాట్లాడుతూ ... నవదీప్ సినిమాల్లో నటిస్తే రొమాన్స్ ... సినిమాలను నిర్మిస్తే వైలెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే అని నాకు ఇప్పుడే అర్థం అయింది అని విశ్వక్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నవదీప్ "లవ్ మౌళి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో బోలెడన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: