ఈ మాత్రం శాఖ‌లకు కేబినెట్లో ఎందుకు చేరావ్ ప‌వ‌నూ... అవ‌మానంగా లేదా ?

Pulgam Srinivas
కొణిదెల పవన్ కళ్యాణ్ 2014వ సంవత్సరం జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. కానీ ఈ పార్టీని స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పోటీలో లేదు. 2019వ సంవత్సరం ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలలో తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. కానీ ఈ ఎన్నికలలో జనసేన పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ పార్టీ నుండి కేవలం ఒక వ్యక్తి మాత్రమే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తే రెండింటిలో కూడా ఓడిపోయాడు.

ఇక 2024వ సంవత్సరం జనసేన పార్టీ తెలుగుదేశం, బిజెపి లతో పొత్తులో భాగంగా పోటీలోకి దిగింది. ఈసారి మాత్రం జనసేన కు గ్రాండ్ విక్టరీ దక్కింది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు ఇవ్వగా వీటన్నింటిలో కూడా గెలిచి 100% విక్టరీని జనసెన సాధించింది. ఇక ఇచ్చిన అన్ని సీట్లలో విజయం సాధించడం, పొత్తులో కీలక వ్యక్తి కావడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు క్యాబినెట్ లో భారీ మంత్రి పదవులు దక్కుతాయి అని అంతా అనుకున్నారు. ఇక ఈయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇచ్చి అలాగే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మరియు రూరల్ వాటర్ సప్లై, ఇన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ పదవులు ఇచ్చారు.

మొదటి నుండి కూడా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవితో పాటు అత్యంత విలువైన, క్రేజ్ కలిగిన మంత్ర పదవులు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ అవి పవన్ కి రాలేదు. మరి పవన్ ఎందుకు ఈ దారి ఎంచుకున్నాడు అని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ హోం మినిస్టర్ లాంటి పెద్ద పదవిని తీసుకోకుండా ఎందుకు ఇవి తీసుకున్నాడు అని కూడా వారు అనుకుంటున్నారు. కాకపోతే పవన్ మాత్రం గ్రామీణ అభివృద్ధి కోసం ఈ మంత్రి పదవులను అడిగిమరీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: