ఈవారం విజేత ఎవరు ?

Seetha Sailaja
ఎన్నికల హడావిడి పూర్తి అయిన తరువాత విడుదలైన శర్వానంద్ ‘మనమే’ విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోవడంతో ఈ సినిమాల కలక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనితో నిరుత్సాహంగా ఉన్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు ఈవారం విడుదల కాబోతున్న అనేక సినిమాలలో ఏఒక్క సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చి కలక్షన్స్ వస్తాయా అన్న అంచనాలలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి.

ప్రస్తుతం టి 20 ప్రపంచ కప్ పోటీలు యూత్ కు పెద్దగా నచ్చక పోవడంతో ఈవారం విడుదల అవుతున్న చిన్న సినిమాల వైపు యూత్ అడుగులు వేస్తారా అన్న ఆశ ఇండస్ట్రీ వర్గాలలో కలుగుతోంది. ఈవారం విడుదల కాబోతున్న సినిమాలలో ప్రధమ స్థానంలో ఉన్నది సుధీర్ బాబు ‘హరోంహర’ ఈమూవీ ట్రైలర్ విడుదల అయ్యాక ఈమూవీ పై అంచనాలు బాగా పెరిగాయి.  

చిత్తూర్ జిల్లా కుప్పం బ్యాక్ డ్రాప్ లో తుపాకులు తయారు చేసే సుబ్రహ్మణ్యం కథగా దర్శకుడు జ్ఞాన సాగర్ఈసినిమాను చాల డిఫరెంట్ గా అని చెపుతున్నాడు.   వరస ఫ్లాప్ లతో సతమైపోతున్న సుధీర్ బాాబు కెరియర్ కు ఈమూవీ విజయం చాలా అవసరం. ఇక విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న అజయ్ ఘోష్ టైటిల్ రోల్ పోషించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఏదైనా డిఫరెంట్ సినిమానా అన్న సందేహాలు వస్తున్నాయి.

ఈ రెండు సినిమాలతో పాటుగా చాందిని చౌదరి ప్రధాన పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్లర్ ‘యేవమ్’ కూడ ఏదైనా ఊహించని  హిట్ అందుకుంటుందా అన్న సందేహాలు మరికొందరకు ఉన్నాయి.  ఇక ఈ లిస్టులో ఫాంటసీ మూవీ ‘ఇంద్రాణి’ మరో చిన్న సినిమా ‘నీ దారే నీ కథ’ కూడ బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉన్న విజయ్ సేతుపతి నటించిన డబ్బింగ్ మూవీ ‘మహారాజ’ కు కూడ బాగా పబ్లిసిటీ చేస్తున్నారు.  ఈసినిమాతో పాటుగా కన్నడ టాప్ హీరో యష్ నటించిన మరో డబ్బింగ్ మూవీ ‘రాజధాని రౌడీ’ కూడ వస్తోంది. దీనితో ఈచిన్న సినిమాల వార్ లో విజేత ఎవరో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: