చీరకట్టుతో మైమరిపిస్తూ కుర్రకారు మనసు దోచుకుంటున్న అనసూయ..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకరింగ్ రంగం ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట ఈ బ్యూటీ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది. నాగార్జున హీరో గా రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడం , అందులో అనసూయ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ బ్యూటీ కి వరుసగా తెలుగు లో అవకాశాలు పెరిగాయి. 

ఇక ఈమె నటించిన చాలా సినిమాలలో తనదైన నటనతో ఈ బ్యూటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు పక్క భాష సినిమాల నుండి కూడా అవకాశాలు రావడం మొదలు అయింది. దానితో ఈమె యాంకర్ రంగానికి కూడా స్వస్తి చెప్పి కేవలం సినిమాల పైన ఫోకస్ పెట్టింది. ఇక మళ్ళీ ఈమె యాంకరింగ్ రంగం లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇక కాసేపు ఈ విషయాలు పక్కన పెడితే ... ఈమె యాంకరింగ్ లోనూ , సినిమాల లోనూ , సోషల్ మీడియా లోనూ ఎక్కువ శాతం చీరలను కట్టుకొని ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.
 

అందులో భాగంగా ఈమె ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చీరలను కట్టుకుంటూ ఉంటుంది. అలాగే ఈమె ఎప్పటికప్పుడు తన చీర కట్టు తో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా అనేక ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇలా అనసూయ చీరకట్టు తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె పుష్ప పార్ట్ 2 మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: