మరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన "మిస్టర్ బచ్చన్" బ్యూటీ..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , భాగ్య శ్రీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారానే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇకపోతే ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటి వరకు పాటలను కానీ , వీడియోలను కానీ ఏమీ విడుదల చేయలేదు. కొన్ని పోస్టర్ లను మాత్రమే విడుదల చేసింది.

అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న భాగ్య శ్రీ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈమె తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో ఈమెకు మొదటి సినిమా విడుదల కాకుండానే తెలుగు లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈమె విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈమె జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ బ్యూటీ కి మరో సినిమా అవకాశం కూడా దక్కినట్లు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ మరికొన్ని రోజుల్లో ఓ స్టేట్ తెలుగు మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్గా తీసుకోవాలి అని మేకర్స్ అనుకుంటున్నాట్లు , అందులో భాగంగా ఈమెను మరికొన్ని రోజుల్లో కలిసి కథను వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే ఈమె దుల్కర్ సల్మాన్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా నటించిన మొదటి సినిమా విడుదల కాకముందే ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bsb

సంబంధిత వార్తలు: