జాన్ అబ్రహం టార్గెట్ లో అల్లు అర్జున్ !

Seetha Sailaja
ఆగస్ట్ 15న విడుదలకాబోతున్న ‘పుష్ప 2’ పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించి బిజినెస్ ఆఫర్లు విపరీతంగా వస్తున్నప్పటికీ ఈ మూవీ నిర్మాతలు మైత్రీ ఫిలిమ్ మేకర్స్ ఏ డీల్ ను ఫైనల్ చేయకుండా బయ్యర్లలో విపరీతమైన పోటీ పెంచుతున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల అయిన తరువాత ఈ మూవీ పై మ్యానియా మరింత పెరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు ఏర్పడ్డ క్రేజ్ రీత్యా ఈ మూవీకి పోటీగా మరొక సినిమా విడుదల అయ్యే ఆస్కారం కనిపించడంలేదు. కన్నడంలో శివరాజ్ కుమార్ నటిస్తున్న మరొక భారీ మూవీ ఆగష్టు 15న విడుదల చేస్తారు అని భావించినా ‘పుష్ప’ మ్యానియాను దృష్టిలో పెట్టుకుని ఆసినిమాల విడుదల వాయిదా పడింది అన్న సంకేతాలు వస్తున్నాయి.

అయితే ఈమూవీ మ్యానియాను బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఏమాత్రం లెక్క చేయడంలేదు అన్న వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా అబ్రహం నటించిన ‘వేదా’ ను విడుదల చేస్తున్నట్లుగా వచ్చిన అధికారిక ప్రకటన చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి జాన్ అబ్రహం బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ల స్థాయిలో ఉన్న టాప్ హీరో కాదు. అతడి సినిమాల పై పెద్దగా మ్యానియా ఉండదు.

అలాంటిది ‘పుష్ప 2’ మ్యానియాను లెక్క చేయకుండా ఏ దైర్యంతో అల్లు అర్జున్ మూవీతో పోటీ పడుతున్నాడు చాలమంది షాక్ అవుతున్నారు. కొంతకాలం క్రితం దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ మూవీని ఆగష్టు 15న విడుదల చేయాలని భావించాడు. అయితే ‘పుష్ప 2’ డేట్ ఫైనల్ కావడంతో ఆపోటీ నుండి రోహిత్ శెట్టి తప్పుకున్నాడు. దీనితో అన్నమాట పరకారం జాన్ అబ్రహం బన్నీకి పోటీ ఇవ్వగలడా లేదంటే ఈ బాలీవుడ్ హీరో కూడ బన్నీ మ్యానియా ముందు భయపడతాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: