"కల్కి" ఫ్రీ రిలీజ్ డేట్ ఎక్కడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో దీపికా పదుకొనే , దిశా పటానీ , అమితా బచ్చన్ , కమల్ హాసన్ , శోభన ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. ఈ సినిమాను జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను జోరుగా ముందుకు సాగిస్తుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి తో ఉన్న ఈ సినిమా ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది ఈ మూవీ లో అత్యంత భారీ గ్రాఫిక్స్ వర్క్ ఉండబోతుంది అని, ట్రైలర్ లో మాత్రం గ్రాఫిక్స్ వర్క్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించడానికి ప్రణాళికల రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అమరావతి లో నిర్వహించాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు , అందుకోసం ఒక భారీ ఖాళీ స్థలం ఉన్న ప్లేసును వెతుకుతున్నట్లు , ఆ ప్లేస్ డిసైడ్ కావగానే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు కూడా ఓ వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: