రవితేజ..నాని..శర్వా లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులు అయినటువంటి రవితేజ , నాని , శర్వానంద్ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో బిజీగా సమయాన్ని గడుపుతున్నారు . ప్రస్తుతం వీరు ఏ సినిమా షూటింగ్ లలో బిజీగా గా ఉన్నారు. ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ ఏ దశ వరకు చేరుకున్నాయి అనే వివరాలను తెలుసు కుందాం.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ హీరోయిన్గా నటిస్తోంది . ఈ నటి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది . ఇకపోతే నిన్నటి వరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శ్రీ మిత్ర రిసార్ట్స్ కి అతి దగ్గరలో జరిగింది. ఇందులో రవితేజ మరియు మరి కొంత మంది నటీనటులు పాల్గొన్నారు.
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని నాని పై చిత్రీకరిస్తున్నారు. ఈ యప్షన్ సన్నివేశం ఈ మూవీ కే కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ ప్రస్తుతం శర్వా 36 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో శర్వానంద్ మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: