"రాయాన్" కొత్త విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తమిళ నటుడు ధనుష్ ప్రస్తుతం రాయన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ లో ధనుష్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ని జూన్ 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

కానీ ఆ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన పనులు అన్నీ పూర్తి కావు అని నేపథ్యం లో ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా విడుదల తేదీన మార్చారు. ఈ మూవీ ని జూన్ 13 వ తేదీన కాకుండా జూలై 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో ఎస్.జే. సూర్య , సందీప్ కిషన్ , కాళిదాస్ జయరామ్ , సెల్వ రాఘవన్ , ప్రకాష్ రాజ్ , దుషార విజయన్ , అపర్ణా బాలమురళి మరియు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ  ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం ఈ మూవీ తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. నాగార్జున ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించనుండగా , రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్గా కనిపించబోతుంది. ఇక ధనుష్ ఇళయరాజా బయోపిక్ లో కూడా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: