మాటమీద నిలబడ్డ బాలయ్య... ఆ నిర్మాతకు కాసుల వర్షం కాయమా..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో ఆయన కొంత మంది పై దురసుగా వ్యవహరిస్తాడు అని చాలా మంది అంటున్నారు. కానీ అది ఆయనకు ఒక వైపు మాత్రమే , ఆ ముందు జరిగిన సంఘటనల గురించి తెలియకుండా ఆయన ఎవరి పైనో కోప్పడిన విషయాన్ని మాత్రమే హైలెట్ చేస్తూ ఉంటారు. ఆయన చిన్న పిల్లడి లాంటి వారు.

ఎవరికి అయిన సహాయం చేయడానికి అయినా అస్సలు వెనకాడరు అని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతూ ఉంటారు. అలాగే ఒక్క సారి మాట ఇచ్చిన తప్పరు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇకపోతే బాలకృష్ణ మరోసారి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరోగా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 అనే మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నిన్న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య , బోయపాటి కాంబోలో 4 వ మూవీ రూపొందబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ ని 14 వీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.

ఇకపోతే 14 రీల్స్ అధినేతకు బాలకృష్ణ చాలా రోజుల క్రితం నీకు ఓ మూవీ చేస్తాను అని చెప్పాడట. దానితో ఆయన అడక్కపోయినా కూడా బాలకృష్ణ నీతో తదుపరి మూవీ చేస్తాను అని చెప్పి మరి అతనితో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బాలయ్య క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మన అందరికీ తెలిసిందే. ఇలా సూపర్ క్రేజ్ ఉన్న టైం లో బాలయ్యతో సినిమా అంటే ఏ నిర్మాతకు కాసుల వర్షం కురిసినట్లే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: