"కాంచన" గా మారబోతున్న మృణాల్..!!
అందులో భాగంగా `కాంచన 4`ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. అయితే.. ఇందులో కాంచనగా మృణాల్ ఠాకూర్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అందంతో, అభినయంతో అలరించిన మృణాల్ దెయ్యంగా మెరవబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు ఒకరిద్దరు హీరోయిన్ల పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై రాఘవ లారెన్స్ స్పందించారు. ఆయన సోషల్ మీడియా ద్వారా ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు కాస్టింగ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలన్నీ కేవలం రూమర్లు మాత్రమే, త్వరలో ఆ వివరాలను తామే రాఘవేంద్ర ప్రొడక్షన్ నుంచి ప్రకటిస్తామని తెలిపారు. కాంచనగా మృణాల్ కనిపిస్తుందనే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పకనే చెప్పారు. మరి ఈ నాల్గో కాంచనగా ఏ బ్యూటీ మెప్పిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే రాఘవ లారెన్స్ హీరోగా బిజీగా ఉంటున్నాడు. హీరోగా వరుస సినిమాలు వస్తున్న నేపథ్యంలో దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చారు. కానీ ఆయన హీరోగా వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేస్తున్నాయి. దీంతో మళ్లీ తనకు లైఫ్ ఇచ్చిన `కాంచన`తో రాబోతున్నారు లారెన్స్.