"సత్యభామ" తో కాజల్ కి ఏమైనా కలిసొచ్చిందా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిన హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె లక్ష్మీ కళ్యాణం అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి , ఆ తర్వాత చందమామ , మగధీర సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకొని చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇప్పటివరకు కాజల్ ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని అద్భుతమైన రీతిలో కెరియర్ ను ముందుకు సాగించినప్పటికీ లేడీ ఓరియంటెడ్ సినిమాలలో మాత్రం ఈమె పెద్దగా రాణించలేదు.

ఈమె కెరియర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు చాలా తక్కువ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనే నటించినప్పటికీ అందులో ఏ సినిమా కూడా గొప్పగా గుర్తింపు పొందిన సినిమా లేదు. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. ఈ మూవీలో ఈ బ్యూటీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదలకు ముందు కాజల్ ప్రమోషన్లను కూడా భారీగా చేసింది. దానితో ఈ మూవీ అయిన కాజల్ కి లేడీ ఓరియంటెడ్ మూవీ లలో భారీ సక్సెస్ ను అందిస్తుందేమో అని చాలా మంది అనుకున్నారు.

ఇక ఈ మూవీ జూన్ 7 వ తేదీన థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలెక్షన్లు కూడా దక్కడం లేదు. ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే కానీ జరిగితే ఈ సినిమాతో కూడా కాజల్ కి సరైన లేడీ ఓరియంటెడ్ హిట్ దక్కనట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: