పోకిరి ఫార్మలాను ఫాలో అయిన ఎన్టీఆర్... హిట్ కొట్టాడా..?

MADDIBOINA AJAY KUMAR
ఏ హీరో అయినా ఏ దర్శకుడు అయిన ఒక బ్లాక్ బాస్టర్ సినిమా వచ్చింది అంటే దానిని ఫాలో అవ్వడానికి కొంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణం అప్పటికే అలాంటి సినిమాలను జనాలు ఇష్టపడుతూ ఉండడంతో ఆ జోనర్ వైపు వెళితే హిట్ ఈజీగా అందుకోవచ్చు అనే సమీకరణాలు అయి ఉండవచ్చు. అందులో భాగంగా కొంతమంది స్టార్ హీరోలు కూడా ఒక సారి బ్లాక్ బస్టర్ అయిన జోనర్ సంబంధించిన సినిమాలను తెరకెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

అందులో భాగంగా కొన్ని సందర్భాలలో ఆ సినిమాలు విజయాలను అందుకుంటే మరికొన్ని సందర్భాలలో మాత్రం ఫ్లాపులుగా నిలుస్తూ ఉంటాయి. ఇకపోతే ఎన్టీఆర్ కూడా ఇలా ఓ బ్లాక్ బస్టర్ సినిమా జోనర్ కు సంబంధించిన మూవీ ని ట్రై చేసి ఫ్లాప్ ను అందుకున్నాడు. అసలు అవి మూవీ ఏది..? అది దేనికి దగ్గరగా ఉంటుంది అనే వివరాలను తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం పోకిరి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ , డెలివరీ అన్నీ కూడా కాస్త డిఫరెంట్ ఉంటాయి. అలాగే ఈ సినిమా కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతూ ఉంటుంది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే కాస్త అటు ఇటుగా ఈ సినిమాకు దగ్గరలో జూనియర్ ఎన్టీఆర్ హీరో గా హన్సిక హీరోయిన్గా మెహర్ రమేష్ దర్శకత్వంలో కంత్రి మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా పోకిరి కి దగ్గరగా ఉంటుంది. లాస్ట్ లో ట్విస్ట్. మాఫియా బ్యాక్ డ్రాప్ గా పోకిరి సినిమాకు దగ్గరగా ఉన్న ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: