ఫేస్బుక్ లవ్.. సినీ ఫక్కీ లో తమ్ముడికి గప్ చిప్ ‌ గా పెళ్లి చేసిన టాప్ కమెడియన్..!

lakhmi saranya
తమిళ్ ఇండస్ట్రీలో బాగా కష్టపడి ఎదుగుతున్న ప్రముఖ హాస్య నటుల్లో యోగి బాబు కూడా ఒకరు.  కమెడియన్ గానే కాకుండా కథానాయకుడుగా పలు చిత్రాల్లో నటించాడు ఈ కమెడియన్. ఏక తాను కథానాయకుడిగా నటించిన చిత్రాలకు అభిమానుల నుంచి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఏడాదికి ఒక సినిమా మాత్రమే కథానాయకుడిగా నటిస్తానని చెబుతూ ఇతర చిత్రాల్లో హాస్య పాత్రలో కనిపించాడు. అయితే అవకాశాల కోసం వెతుకుతున్న రోజుల్లో భోజనానికి కూడా ఇబ్బంది పడిన ఆయన నేడు చెన్నైలోనే చాలా స్థలాలు, ఇల్లులు సమకూర్చుకున్నాడు.
ఇక ఇప్పుడు సినిమాలకి కోట్లలో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటూ గొప్ప స్థాయికి ఎదిగాడు. నటుడు యోగి బాబు 2020లో భార్గవిని వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ జంటకు ఒక కుమారుడు, కుమార్తె. గత ఏడాది కూడా యోగిబాబు తన బిడ్డ మొదటి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో యోగి బాబు ఇంట్లో మరో విచిత్రం చోటుచేసుకుంది. నటుడు యోగి బాబు తమ్ముడు విజయన్ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మైసూర్ కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడట. దీంతో యోగి బాబు తన తమ్ముడి పెళ్లిని జరిపించాడు. తమిళ్ చిత్ర సీమలో దర్శకుడిగా ఎదగాలని ఆయన తమ్ముడు కష్టపడుతున్నారు.
ప్రస్తుతానికి యోగి బాబు కాల్ షీట్స్ తో సహా అన్న పనులు అన్ని చూసుకుంటున్నాడు. అతడికి ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైనట్లు తెలుస్తోంది. అనంతరం ఒకరి ఒకరు అర్థం చేసుకుని ప్రేమించుకున్నారు. అయితే ఆ యువతి పాదుకర్ వర్గానికి చెందినది కావడంతో పెళ్లి పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో యోగి బాబు నేరుగా ఆమె కుటుంబంకులను సంప్రదించి పెళ్లికి ఏర్పాటు చేశారు. జూన్ మూడవ తేదీన యోగిబాబు స్వగ్రామం లో వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది. ఈ వివాహానికి తమ బంధువులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: