అదిరిపోయే ధరకు అమ్ముడుపోయిన "ఓజి" డిజిటల్ రైట్స్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే , మరో వైపు రాజకీయ పనులతో బిజీగా సమయాన్ని గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా చాలా రోజుల క్రితం పవన్ , సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని మొదలు పెట్టాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇన్ని రోజుల పాటు రాజకీయ పనులతో బిజీగా సమయాన్ని గడిపిన పవన్ కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మరికొన్ని రోజుల్లో రాజకీయ పనులన్నీటిని చక్కబెట్టి మళ్లీ ఈ సినిమా ఓజి షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి ఓ టీ టీ డీలు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఓ సంస్థ అత్యంత భారీ రేటుకు దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 90 కోట్లకు పైగా ధరతో దక్కించుకున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. డి  వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి  వి వి దానయ్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: