ఆ తేదీ నుండి వరుణ్ తేజ్ "మట్కా" నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్..!

Pulgam Srinivas
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముకుందా మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ నటుడు ఆ తర్వాత చాలా తక్కువ కాలం లోనే చాలా విజాయలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను ఏర్పరచుకున్నాడు. ఇక కెరియర్ ప్రారంభించిన కొత్తలో వరుసగా చాలా విజాయలను అందుకున్న ఈ నటుడు ఈ మధ్య కాలంలో మాత్రం విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయాడు. 

ఈ మధ్య కాలంలో ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కొన్ని రోజుల క్రితమే ఈ నటుడు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 

ఇకపోతే చాలా రోజుల క్రితమే ప్రసన్న కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ మట్కా అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా యొక్క నెక్స్ట్  షెడ్యూల్ ను జూన్ 19 వ తేదీన మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ... నవీన్ చంద్ర , నోరా ఫతేహి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. కార్తీక్ శ్రీనివాస్ ఈ మూవీ కి ఎడిటర్ గా వర్క్ చేస్తూ ఉండగా , జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt

సంబంధిత వార్తలు: