అఫిషియల్ : కన్నప్ప టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ కుమారుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన ఇప్పటికే అనేక సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు . ఇక పోతే ప్రస్తుతం ఈయన కన్నప్ప అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ లో ప్రభాస్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా , మోహన్ లాల్ , శివరాజ్ కుమార్ , కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమా లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.
 

అలాగే ఈ మూవీ లో సలార్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రేయ రెడ్డి కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . ఇలా ఇండియా లోనే అద్భుతమైన క్రేజ్ ఉన్న ఎంతో మంది నటీ నటులు ఈ సినిమాలో భాగం అవుతుండడం తో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నీ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు.

ఈ మూవీ యొక్క టీజర్ ను జూన్ 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి మంచు విష్ణు ఈ సినిమాతో కనుక మంచి విజయాన్ని అందుకున్నట్లు అయితే ఈయనకు దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో ఈయన ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mv

సంబంధిత వార్తలు: