"విశ్వంభర" పై వచ్చిన ఆ వార్త పూర్తిగా అవాస్తవం... మేకర్స్ క్లారిటీ..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా  ఆశకా రంగనాధ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా , యూ వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ మూవీ ని ఎంతో భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాను కచ్చితంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయాలి అనే ఉద్దేశంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి కూడా కేవలం ఈ ఒక్క సినిమాలోనే హీరో గా నటిస్తూ ఉండడంతో ఫుల్ గా ఈ మూవీ కి డేట్స్ ఇచ్చేశాడు. దానితో కూడా ఈ సినిమా షూటింగ్ స్కూల్ స్పీడ్ గా జరుగుతుంది.

కాకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో మెగా హీరోలలో ఒకరు అయినటు వంటి వైష్ణవ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని వస్తున్న వార్తలు ఏ మాత్రం వాస్తవం లేదు అని అవన్నీ ఫేక్ వార్తలు అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతానికి విశ్వంబర మూవీ పై ప్రేక్షకుల్లో మాత్రం భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: