అకీరా నంద‌న్ మ్యానియా !

Seetha Sailaja

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ గా మారడంతో ప్రింట్ మీడియా ఎలాటరానికి మీడియా సోషల్ మీడియా పవన్ నామస్మరణతో హోరెత్తిపోతోంది. పవన్ కళ్యాణ్ పేరుతో సరి సమానంగా అతడి కొడుకు అకిరా నందన ఇప్పుడు ట్రెండింగ్ స్టార్ గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళుతున్నా అతడి కూడ అకిరా నందన్ కనిపిస్తూ ఉండటంతో పవన్ అభిమానుల దృష్టితో పాటు మీడియా దృష్టిలో కూడ అతడు ట్రెండింగ్ స్టార్ గా మారిపోయాడు.

దీనికితోడు లేటెస్ట్ గా అకిరా పవన్ పాత సినిమాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి తాను బ్యాక్ గ్రౌండ్ కంపోజ్ చేసి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. ఈ వీడియో పై రేణుదేశాయ్ స్పందిస్తూ అకిరా క్రితం సంవత్సరం తన తండ్రి పుట్టినరోజుకు ఇచ్చిన విలువైన బహుమతి ఇది అంటూ కామెంట్ చేయడంతో  ఈ వీడియో మరింత ట్రెండింగ్ గా మారింది.

వాస్తవానికి సంగీతం పట్ల మ్యూజిక్ విషయంలో విపరీతమైన ఆశక్తి ప్రదర్శిస్తున్న అకిరా నందన్ ప్రస్తుతం అమెరికాలో ఫిలిమ్ మేకింగ్ లో డిగ్రీ చేస్తున్నాడు. అయితే పవన్ అభిమానులు మాత్రం అతడిని పవర్ స్టార్ వారసుడుగా వెండితెర పై చూడాలని ఆశ పడుతుంటే అకిరా అభిరుచి మాత్రం వేరేవిధంగా కనిపిస్తూ ఉండటంతో పవన్ అభిమానులు అసంతృప్తికి లోనవుతున్నారు.

ఈవిషయమై తమ అసంతృప్తిని కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ దృష్టికి తీసుకు వచ్చినప్పుడు ఆమె చాల ఘాటుగా స్పందించింది. అకిరా చిన్నపిల్లవాడు కాదనీ తనకు ఏ విషయం పై అభిరుచి ఉంటే ఆ రంగంలో రాణిస్తాడని ఈవిషయంలో ఒక తల్లిగా తన ఒత్తిడి ఉండదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే అకిరా లుక్ యంగ్ బాలీవుడ్ హీరోలా కనిపిస్తూ ఉండటంతో పవన్ అభిమానులు మాత్రం ఏదోవిధంగా అతడి మైండ్ సెట్ ను మార్చాలని సోషల్ మీడియాలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: