రేపు విడుదల కాబోయే 3 సినిమాల క్రేజీ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఇక విడుదల కావడానికి రెడీగా ఉన్నా కొన్ని సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలా రేపు విడుదల కాబోయే మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో కాస్త మంచి అంచనాలు ఉన్న ఆ సినిమాలు ఏవి..? వాటికి సెన్సార్ బృందం నుండి ఎలాంటి రిపోర్ట్ వచ్చింది..? ఆ సినిమాలు ఎంత రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇలాంటి వివరాలను తెలుసుకుందాం.
మనమే : శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా రేపు అనగా జూన్ 7 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా , ఈ మూవీ 2 గంటల 35 నిమిషాల నిడివితో థియేటర్లలో విడుదల కానుంది. ఇకపోతే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.
సత్యభామ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 7 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా , ఈ మూవీ 2 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.
లవ్ మౌళి : ఈ సినిమా రేపు అనగా జూన్ 7 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 26 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: